క‌ల‌క‌లం రేపుతున్న‌.. ఎంపీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..!

వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తాజాగా ఎంపీ రఘురామ కృ‌ష్ణంరాజు పై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. పార్టీ విధానాలు న‌చ్చ‌క‌పోతే రాజీనామా చేసి వెళ్ళిపోవ‌చ్చ‌ని, ఉత్త‌రాంధ్ర వ్య‌వ‌హారాల్లో క‌లుగ‌జేసుకుంటే సహించేది లేద‌ని హెచ్చ‌రించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇమేజ్‌తో గెలిచిన నువ్వు, మ‌రోసారి ఆయ‌ను వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేస్తే ఊరుకునేది లేద‌ని అవంతి శ్రీనివాస్ ఘాటుగానే రాఘురామ్‌కు వార్నిగ్ ఇచ్చారు.

ఈ క్ర‌మంలో అవంతి వ్యాఖ్య‌ల పై రఘురామకృష్ణంరాజు స్పందించారు. తాను ఎవ‌రి ఇమేజ్‌తో ఎంపీగా ఎంపీగా గెలివ‌లేద‌ని, కేవ‌లం త‌న చ‌రిష్మాతోనే విజ‌యం సాధించానని ర‌ఘురామ్ అన్నారు. ఇక అవంతి శ్రీనివాస్ భీమిలీలో, జ‌గ‌న్ ఇమేజ్‌తోనే గెలిచి ఉండ‌వ‌చ్చ‌ని, తాను మాత్రం ఎవ‌రి అండ‌తో గెల‌వ‌లేద‌ని మ‌రోసారి స్పష్టం చేశారు. అంతే కాకుండా అస‌లు తాను ఎంపీ ప‌ద‌వికి ఎందుకు రాజీనామా చేయాల‌ని ర‌ఘురామ్ ప్ర‌శ్నించారు. అలాగే ఇటీవ‌ల మృతి చెంద‌ని న‌లంద కిషోర్ మ‌రణించ‌డానికి పోలీసులే కార‌ణ‌మ‌ని ర‌ఘురామ కృష్ణంరాజు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి తాజాగా ర‌ఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్య‌లకు పార్టీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.