పెళ్ళిపై న‌మ్మ‌కం లేదు.. వీసా కోసమే చేసుకున్నా

హాట్ అండ్ బోల్డ్‌ బ్యూటీ రాధిక ఆప్టే గురించి పెద్ద‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న అందంతో కుర్ర‌కారు హృద‌యాల‌ను గెలుచుకున్న ఈ అమ్మ‌డు ఒక్కోసారి బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో అంద‌రు నోరెళ్ళ‌పెట్టేలా చేస్తుంది. ర‌క్త చ‌రిత్ర సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన రాధికా ఆప్టే లెజండ‌, ల‌య‌న్ , క‌బాలి వంటి చిత్రాల‌లోను న‌టించింది. ప‌లు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లోను న‌టించిన ఈ అమ్మ‌డు వెబ్ సిరీస్‌ల‌లో హాట్ హాట్‌గా క‌నిపించి యువ‌త‌కు నిద్ర లేకుండా చేసింది.

2012లో బ్రిటీష్ మ్యుజీషియ‌న్ బెనెడిక్ట్ టేల‌ర్‌ని వివాహ‌మాడిన రాధికా ఆప్టే ప్ర‌స్తుతం భ‌ర్తతో క‌లిసి లండన్‌లో నివ‌సిస్తుంది. సినిమా షూటింగ్స్ ఉన్న‌ప్పుడు మాత్రం భార‌త్‌కు వ‌స్తుంటుంది. అయితే తాజాగా త‌న పెళ్లి గురించి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాధికా ఆప్టే సంచ‌ల‌న కామెంట్స్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పెళ్ళి వ్య‌వ‌స్థ‌పై నాకు అస్స‌లు న‌మ్మ‌కం లేదు. వివాహాన్ని నేను న‌మ్మ‌ను. విదేశాల్లో ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వీసా అతి సులభంగా లభిస్తుందని తెలుసుకున్న తర్వాత పెళ్ళి చేసుకున్నాన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పుకొచ్చింది. వీసా పొంద‌డం స‌మ‌స్య‌గా మారిన త‌ర్వాత‌ కేవ‌లం దీనికోస‌మే పెళ్లి చేసుకున్నానంటుంది రాధిక‌.

 

హాట్ పాత్ర‌ల‌లో న‌టించేందుకు ఏమాత్రం వెనుకాడ‌ని రాధికా ఆప్టే అజయ్ దేవగన్ నిర్మాతగా, లీనా యాదవ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ‘పార్చ్ డ్’ అనే బాలీవుడ్ చిత్రంలో నూలు పోగు లేకుండా న‌టించింది. తన కోస్టార్ అదిల్ హుస్సైన్ తో రొమాన్స్ చేసే సన్నివేశాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. గతంలో ‘హంటర్’ అనే సినిమాలో కూడా రాధిక ఇలానే రెచ్చిపోయింది. శృంగార సన్నివేశాలు బాగా రావటం కోసం రాధిక చూపే అంకిత భావం, ధైర్యం నిజంగా మిగతా హీరోయిన్లకు ఆదర్శనీయమని చెప్పుకోవాలి. లాక్ డౌన్ నుండి లండ‌న్‌లో ఉంటున్న రాధిక ప్ర‌స్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. వ‌ర్కువ‌ట్స్ చేస్తూ కొత్త క‌థ‌లు రాస్తూ, సినిమాలు చేస్తూ స‌రదాగా గ‌డుపుతుంది.