Rajeev Kanakala: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు, కమెడియన్ రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజీవ్ తెలుగు స్టార్ ఫిమేల్ యాంకర్ అయిన సుమను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించిన రాజీవ్ కనకాల ఈ మధ్యకాలంలో కేవలం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. సినిమాలలో తక్కువగా నటిస్తూ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీబిజీగా ఉన్నారు.
ఇప్పటికే ఇప్పటికే రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు యాంకర్ సుమ షోలకు యాంకర్ గా వ్యవహరించడంతోపాటుగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఆడియో ఫంక్షన్ లు, ప్రమోషన్స్ కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే సినీ నటుడు రాజీవ్ కనకాలకు హైదరాబాద్ లోని రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పసుమాములలో తనకు సంబంధించిన వివాదస్పద ప్లాటును సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ చౌదరికి గతంలో విక్రయించారు. అదే ప్లాటును విజయ్ చౌదరి మరో వ్యక్తికి రూ. 70 లక్షలకు విక్రయించాడు. అయితే లేని ప్లాటును ఉన్నట్లు చూపి తమను మోసం చేశారని బాధితుల ఆరోపించారు. దీంతో విజయ్ చౌదరిపై హయత్ నగర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో విచారణకు రావాలని రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరి ఈ విషయంపై రాజీవ్ కనకాల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..
Rajeev Kanakala: సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు.. అసలేం జరిగిందంటే!
