Raashi Khanna : వరల్డ్ ఫేమస్ సిరీస్ కి రాశీ ఖన్నా కూడా పెద్ద ఫ్యాన్

సౌత్ ఇండియన్ గ్లామరస్ హీరోయిన్స్ లో రాశీ ఖన్నా కూడా ఒకరు. తన రెండో సినిమా నుంచే మంచి గ్లామర్ షో తో యూత్ ని ఆకట్టుకున్న ఈ హీరోయిన్ తర్వాత మంచి స్టార్ స్టేటస్ తెచ్చుకొని ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. అయితే ఓటిటి ప్రపంచంలో అతి పెద్ద హిట్ అయ్యినటువంటి వరల్డ్ ఫేమస్ హిట్ సిరీస్ మనీ హేస్ట్ కోసం అందరికీ తెలిసిందే.

ప్రపంచ ప్రసిద్ధి ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండే ఈ సిరీస్ కి ఈమె కూడా పెద్ద అన్నట్టు అర్ధం అవుతుంది. గత కొన్ని రోజులు కితమే మనీ హేస్ట్ లోని ఫైనల్ సీజన్ చివరి ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కి వచ్చాయి. అవి చూసి తాను తన రెస్పాన్స్ ని పంచుకోకుండా ఉండలేకపోయింది. “రోలర్ కాస్టర్ లాంటి ఎమోషన్స్ తో మనీ హేస్ట్ ఫైనల్ ఉందని” తన స్పందనను నెటిజన్స్ తో పంచుకుంది. దీనితో ఈ ట్వీట్ కాస్తా వైరల్ అవుతుంది.

Raashi Khanna