Pushpa Trailer: పుష్పరాజ్ ఫుల్ ట్రైలర్ వచ్చేసింది!

Pushpa Trailer: ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ‘పుష్ప- ది రైజ్, పార్ట్ -1’ ట్రైలర్ వచ్చేసింది… ఫ్యాన్స్ కోరుకుంటున్న పంచ్, పుష్, సీమ యాస డైలాగ్స్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ పుష్క లంగా వున్న ట్రైలర్ రిలీజయిన క్షణాల్లో వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అల్లు అర్జున్ ని ఫ్యాన్స్ అంచనాలకి దీటుగా న్యూ అవతార్ లో చూపిస్తున్న ఈ ట్రైలర్ దిమ్మదిరిగే విజువల్స్ తో వుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల నుంచి విదేశాలకు వేలకోట్ల విలువైన సరుకు ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారో వివరించే డైలాగులతో రెండున్నర నిమిషాల ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.

పుష్పరాజ్ అలియాస్ పుష్పగా అల్లు అర్జున్ జీవనోపాధి కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ట్రక్ డ్రైవర్ గా యాక్షన్ సీనుతో, అరెస్టుతో, క్రేజీగా పరిచయమవుతాడు. అల్లు అర్జున్ ఎంట్రీతో రస్టిక్ విజువల్స్ చూస్తే, ఈ మూవీలో హై వోల్టేజి యాక్షన్ థ్రిల్లర్ సీన్స్ గ్యారంటీ అన్నట్టు వుంది.

 

ట్రైలర్‌లో కీలక పాత్రల్లో ఇతర నటులు కూడా కనిపిస్తారు. సునీల్ రొటీన్ కామెడీ పాత్రల నుంచి ఫ్రెష్ గా పచ్చి విలన్ గ్రూపులో నెగెటివ్ గా కన్పిస్తున్నాడు. పాపులర్ బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒక విచిత్రమైన పాత్రలో కన్పిస్తోంది.

ఇక విలన్ గా మలయాళ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ట్రైలర్ చివరి షాట్ లో కనిపిస్తాడు. మందపాటి మీసాలతో, క్లీన్-షేవ్ హెడ్ తో టెర్రిఫిక్ లుక్ అతడిది. కన్పించే కొద్ది సెకన్లలో బలమైన ఇంపాక్ట్ తో వున్నాడు.

హీరోయిన్ రస్మిక మందన్న ఇంకో ఎట్రాక్షన్. ఈమెతో అల్లు అర్జున్ మాస్ రోమాన్స్ తో ఫుల్ మజా ఇచ్చేటట్టు వున్నాడు. ఒక వైపు స్మగ్లింగ్, ఇంకో వైపు పోలీస్ వేట, మరోవైపు రోమాన్స్ లతో అల్లు అర్జున్ నటన ఆలిండియా సంచలనం ఖాయం అన్పిస్తోంది. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్!’ అన్న అల్లు అర్జున్ గర్జన తో సుకుమార్ దర్శకత్వం తారాస్థాయికి చేరింది. ఇంకా జగపతి బాబు, ప్రకాష్‌రాజ్, ధనంజయ్‌లు నటించిన ఈ మూవీ తెలుగుతో బాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 17 న విడుదలవుతోంది.