Pushpa Song : ఇండియాస్ బెస్ట్ డాన్స్ షోలో “పుష్ప” హవా..దేవి షాకింగ్ రియాక్షన్.!

Pushpa Song :  గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప పార్ట్ 1” కూడా ఒకటి. ఏడాది చివరి నెలలో వచ్చినా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప సంచలన హిట్ ని నమోదు చేసింది. అయితే ఈ భారీ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం కూడా అని చెప్పి తీరాలి.

జెనరల్ గా బన్నీ, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబో అంటే వుండే అంచనాలు అన్నిటినీ అందుకొని ఒక్కో సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాలో హిట్ ట్రాక్ సామి సామి ఏకంగా ఇండియన్ బెస్ట్ డాన్స్ షో లో అందులోని ఫైనల్స్ ఎపిసోడ్ లో పోటీకి చెయ్యడం వైరల్ గా మారింది. మరి దీనిపై దేవి కూడా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు.

సామి సామి సాంగ్ హిందీ లో ఫైర్ గా ఉందని ఇంత లవ్ చూపుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని తెలిపాడు. మొత్తానికి మాత్రం బన్నీ గత సినిమా అల వైకుంఠ పురములో ఆల్బమ్ లానే కొన్నాళ్ల పాటు పుష్ప ఆల్బమ్ హవా కొనసాగడం గ్యారెంటీ అనిపిస్తుంది.