ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కోసం రాబోతున్న భారీ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ ల కాంబోలో వస్తున్న చిత్రం పుష్ప పార్ట్ 2 కూడా ఒకటి. పుష్ప ది రూల్ పేరిట తెరకెక్కించనున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ హైప్ కి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి షూటింగ్ కి ఇంకా సమయం ఉంది.
కానీ గత కొన్ని రోజులు నుంచి అయితే ఈ సినిమా పై టాలీవుడ్ వర్గాల నుంచి కొన్ని గాసిప్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు అయితే ఈ ప్రోగ్రెస్ లో బిగ్ ఛేంజ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ బన్నీ సమీప వర్గాల వారు చెప్తున్నా దాని ప్రకారం అయితే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ సమాచారాలే బయట వచ్చాయి.
మరి సమాచారం చూస్తే ఈ సినిమాని మేకర్స్ ఈ జూలై ఎండింగ్ నుంచే షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారట. అలాగే అనుకోని విధంగా ఈ సినిమా రిలీజ్ పై కూడా బిగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి లోనే రిలీజ్ కి వచ్చేస్తుంది అట.
ఇది షాకింగ్ అని చెప్పాలి. ఇంతకుముందు సుకుమార్ ఎక్కడో మాట్లాడుతూ వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు అల్లు కాంపౌండ్ నుంచి వచ్చిన సమాచారం అయితే వచ్చే ఏడాది వేసవి రిలీజ్ అంటున్నారు. అంటే ఇది పెను మార్పే అని చెప్పాలి.