పూరీ తనయుడు ఆకాష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రొమాంటిక్’. క్యూట్ అండ్ హాట్ కేతికా శర్మ ఈ సినిమాలో ఆకాష్‌తో జత కడుతోంది. ఎప్పుడో విడుదలవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలని అనౌన్స్ చేశారు చిత్ర బృందం. డిశంబర్ 4న ‘రొమాంటిక్’ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయితే సడెన్‌గా రిలీజ్ డేట్ మారింది.
అక్టోబర్ 22న ‘రొమాంటిక్’ రిలీజ్ అంటూ తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే దీపావళి కన్నా ముందే ‘రొమాంటిక్’ ధియేటర్లలో సందడి చేయనుందన్న మాట. పూరీ జగన్నాధ్ ప్రియ శిష్యుడు అనిల్ పాదూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
పూరీ జగన్నాధ్ ఈ సినిమాకి కథ, స్ర్కీన్‌ప్లే అందిస్తుండడం విశేషం. హీరోగా ప్రామిసింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నప్పటికీ ఆకాష్‌కి సరైన హిట్ పడలేదింతవరకూ. ‘మెహబూబా’ సినిమా కోసం డైరెక్టుగా పూరీ జగన్నాధే రంగంలోకి దిగినప్పటికీ అది కూడా సక్సెస్ కాలేదు. కానీ, ఆకాష్ నటనలోని మెచ్యూరిటీకి మాత్రం ఆడియన్స్ ఫిదా అయ్యారు.
లక్ కలిసొచ్చి,’రొమాంటిక్’ హిట్ అయితే, ఆకాష్ మంచి హీరో అనిపించుకోవడం పక్కా. చూడాలి మరి, ‘రొమాంటిక్’తో ఆకాష్ ఎక్స్‌పెక్టేషన్స్ అందుకుంటాడో లేదో.