Puneeth Raj Kumar : పునీత్ సినిమాకి ఇంతకన్నా గొప్ప నివాళి ఏముంది? ఏంటో తెలుసుకోండి.!

Puneeth Raj Kumar : ఇటీవల ఇండియన్ సినిమా దగ్గర నెలకొన్న తీరని విషాదం కన్నడ సినిమాకి చెందిన నటుడు ప్రముఖ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం. దీనితో ఒక్కసారిగా కన్నడ ప్రజల్లోనే కాకుండా తెలుగు ఆడియెన్స్ లో కూడా పునీత్ రాజ్ కుమార్ పేరు మారుమోగింది. తాను చేసిన ఎన్నెన్నో సాయాలు తెలుసుకొని అంతా ఒక్కసారిగా చలించిపోయారు.
వెండితెరపై కళ్ళు చెదిరే డాన్స్ లు అదిరే ఏక్షన్ ని పండించే పునీత్ లో ఈ కోణం కూడా ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు. దీనితో తాను నటించిన లేటెస్ట్ సినిమా “జేమ్స్” ని మాత్రం కనీ వినీ ఎరుగని రీతి వెల్కమ్ ఇవ్వాలని అంతా ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే పునీత్ సినిమాకి పోటీగా ఏ సినిమా కూడా రిలీజ్ చెయ్యకూడదని అక్కడి డిస్ట్రిబ్యూటర్ లు ఒక నిర్ణయం తీసుకొని నివాళి ఇవ్వగా..
అభిమానులు అయితే ఆల్ టైం రికార్డు ఏకంగా బాహుబలి 2 ని దాటి అందించారు. ఇక వీటిని మించి ఇంకో ఘనమైన నివాళి అయితే మరొకటి ఉంది. ఇది వింటే జెనరల్ ఆడియెన్స్ కి కాస్త ఒళ్ళు జలదరించవచ్చు. ఏ సినిమా అయినా కూడా రిలీజ్ అయ్యిన ఒక్క రోజులోనే కొన్ని పైరసి సైట్లు అప్ లోడ్ చేసేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే.
కానీ ఇప్పుడు వారు కూడా పునీత్ సినిమాని మేము ఆయనకి నివాళిగా తమ సైట్స్ లో పెట్టబోవడం లేదని, థియేటర్స్ లోనే ఎంజాయ్ చెయ్యాలని సూచించారు. ఇంతకన్నా గొప్ప నివాళి అయితే పునీత్ కి మరొకటి లేదనే చెప్పాలి. పైరసి కి ఎలాంటి అడ్డు కట్ట ఉండదు అనుకుంటారు. కానీ అలాంటి వారిని కూడా పునీత్ కదిలించేలా చేశారు. దీని బట్టి తాను ఎంత గొప్ప వ్యక్తో అర్ధం చేసుకోవాలి.