పవన్-పూరి కాంబినేషన్.. ఎంతవరకు నిజం ?

Producer trying to out Pawan, Puri Jagannadh on track
Producer trying to out Pawan, Puri Jagannadh on track
 
దర్శకుడు పూరి జగన్నాథ్ ఎవరితో సినిమా చేసినా ఒక సెన్సేషనే.  ప్రతి హీరోకి ఒక ట్రేడ్ మార్క్ పడేలా ఉంటాయి పూరి సినిమాలు. అందునా బడా హీరోలతో ఆయన వర్క్ ఇంకా క్రేజీగా ఉంటుంది. పైగా పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో సినిమా అంటే హైప్ వేరే లెవల్. 
 
అందుకే వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది.  తాజాగా మరోసారి పవన్, పూరి కలిసి వర్క్ చేస్తారనే టాక్ మొదలైంది.  పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’. మహేష్ బాబు కోసమే ఈ కథ రాసుకున్నారు. కానీ మహేష్ పూరితో సినిమా చేయడానికి ఎందుకో సుముఖంగా లేరు.  
 
పూరి సైతం మహేష్ కోసం ఎదురుచూసి చూసి మనసు మార్చుకున్నారు. వేరొకరితో సినిమాను పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పేరు తెరమీదకు వచ్చింది.  పవన్ రీఎంట్రీ ఇచ్చి చకా చకా సినిమాలు చేస్తున్నారు. ఆయనతో వర్క్ చేయాలనే కోరిక ఉన్న ప్రతి నిర్మాత ఇదే సరైన సమయని అడ్వాన్సులు పట్టుకుని దర్శకుల కోసం తిరుగుతున్నారు.
 
అలాంటి నిర్మాతల్లో ఒకరు పూరిని పవన్ ను కనెక్ట్ చేసి సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఆ నిర్మాత ఎవరు, ఆయన ప్రయత్నాలు ఫలించి పూరి, పవన్ కాంబినేషన్ మూడవసారి కుదురుతుందా లేదా అనేది ఇంకొన్ని రోజుల తరువాతే తెలుస్తుంది. ఇకపోతే పవన్ మొత్తం నాలుగు సినిమాలకు సైన్ చేసి ఉండగా పూరి ‘లైగర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.