Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సమంత ఒకరు. ఈమె ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కాని ఇటీవల కాలంలో తన వ్యక్తిగత విషయాలు అలాగే అనారోగ్య సమస్యల కారంగా ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చారు. అయితే ప్రస్తుతం పలు సినిమాలో షూటింగ్ పనులలో సమంత బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా సమంత గురించి ప్రముఖ సీనియర్ నిర్మాత ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి ఈయన సమంతకు తన ఫామ్ హౌస్ ఇచ్చారు అంటూ మాట్లాడారు ప్రస్తుతం దాని ధర కోట్లలో ఉంది అంటూ నిర్మాత బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో సమంత అల్లుడు శీను జబర్దస్త్ వంటి సినిమాలు చేశారు అయితే ఓ సినిమా కోసం సమంతకు ఈయన రెమ్యూనరేషన్ ఇవ్వకుండా తన ఫామ్ హౌస్ రాసిచ్చారని తెలిపారు. సమంతకు 1250 గజాలు ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ ఇచ్చానని తెలిపారు అప్పట్లో ఈ ఫామ్ హౌస్ ధర కోటి 50 లక్షలు అయితే ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ దర భారీగా పెరిగిపోయిందని తెలిపారు.
ప్రస్తుతం అక్కడ ఒక గజం 2 లక్షల రూపాయల విలువ చేస్తుందని ఇటీవల బెల్లంకొండ సురేష్ ఒక కార్యక్రమంలో భాగంగా సమంతకు కోట్లు విలువ చేసే ఫామ్ హౌస్ ఇచ్చాను అంటూ ఈయన మాట్లాడటంతో పలువురు ఈయన వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ఒకప్పుడు రెమ్యూనరేషన్ కి బదులుగా ఇచ్చిన ఈ ఫార్మ్ హౌస్ కి ఇప్పుడు వెలకట్టడం ఏంటి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.