Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఒక అడ్వెంచర్స్ సినిమాగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న మహేష్ బాబు గురించి తాజాగా నిర్మాత అనిల్ సుంకర ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర మహేష్ బాబుతో ఏకంగా నాలుగు సినిమాలు చేశారు..1 నేనొక్కడినే, సరిలేరు నీకెవ్వరు దూకుడు, ఆగడు వంటి సినిమాలను చేశారు అయితే ఇందులో సరిలేరు నీకెవ్వరు దూకుడు సినిమాలు మంచి సక్సెస్ కాగా, ఆగడు పరవాలేదు అనిపించుకుంది. ఇక 1నేనొక్కడినే సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా గురించి తాజాగా అనిల్ సుంకర మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తాను మహేష్ బాబుతో ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది అంటూ ఈయన తెలియజేశారు. నిజానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేయాల్సిన సినిమా కాదని, నాని లాంటి హీరోలైతే ఈ సినిమాకు సెట్ అయ్యేవారు అంటూ అనిల్ సుంకర తెలిపారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అంతా బాగా అనిపించింది కానీ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత సినిమా చూడగానే ఏదో తక్కువ అయిందని తెలుస్తోంది. ఇలా విడుదలకు ముందే సినిమా ఫలితం పై నాకు సందేహాలు ఉండేవని, విడుదలైన తర్వాత నా అనుమానాలు నిజమయ్యాయని అనిల్ సుంకర తెలిపారు. మహేష్ బాబుతో ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.