Priyanka Chopra: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి ప్రియాంక చోప్రా ఒకరు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ హాలీవుడ్ వెళ్లారు. అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్ గాను అదే విధంగా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ అక్కడ కూడా హీరోయిన్గా సక్సెస్ అవ్వడం కోసం కష్టపడుతున్నారు.
ఇలా హాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నటువంటి ప్రియాంక చోప్రా త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా రాబోతున్నారు ఈమె మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వర్క్ షాప్ ఫ్రీ లుక్ టెస్ట్ అన్ని కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఇలా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటించబోతున్నారు అనే విషయం తెలియడంతో ఈమె రెమ్యూనరేషన్ గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందని అందరూ భావించారు. ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ సీటాడెల్ చిత్రం కోసం ఐదు మిలియన్ డాలర్ల పారితోషకం అందుకుందట. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 45 కోట్ల పైమాటే.. అంటే ఇక్కడ ఆమె ఫుల్ లెన్త్ హీరొయిన్ గా చేస్తే దాదాపు దానికి డబుల్ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని భావిస్తున్నారు.
ఇలా డబుల్ రెమ్యూనరేషన్ అంటే దాదాపు 80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అని చెప్పాలి ఈ సినిమాతో మన తెలుగులో గత ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన బాహుబలి లాంటి సూపర్ హిట్ సినిమాని చేయవచ్చు. అయితే ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రాకు నిర్మాతలు కేవలం పాతిక కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా పాతిక కోట్లకు కూడా ప్రియాంక చోప్రా కమిట్ అయ్యారని తెలుస్తుంది.
రాజమౌళి సినిమా అంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో సక్సెస్ అందుకుంటుంది ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ లకు అలాగే సైడ్ క్యారెక్టర్లకు మాత్రమే పరిమితమైన ప్రియాంక చోప్రా ఈ సినిమాతో మంచి హిట్ కొడితే తనకు హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ఈమె తక్కువ రెమ్యూనరేషన్ కే కమిట్ అయ్యారని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ప్రియాంక చోప్రా హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.