Priyamani: ఆ రీమేక్ లో న‌టించాలని ఉంది.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ ప్రియమణి!

Priyamani: టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి గురించి మనందరికీ తెలిసిందే. తెలుగుతోపాటు హిందీ తమిళ భాషల సినిమాల్లో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు డాన్స్ షోలకు జడ్జ్ గా కూడా వ్యవహారించింది. ప్రస్తుతం నటనకు ఎక్కువగా స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ప్రియమణి. ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇటీవలే ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా గుడ్ వైఫ్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సీరీస్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియమణి మాట్లాడుతూ.. మ‌నీ హీస్ట్ కు త‌మిళ వెర్ష‌న్ చేయ‌డానికి నేను చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నాను.

ఇప్పటికే నేను జవాన్ సినిమాలో చేసిన పాత్ర‌ను ఆడియ‌న్స్ మ‌నీ హీస్ట్ కు రీమేక్ లానే ఉంటుంద‌ని అంటున్నారు. మ‌నీ హీస్ట్ లోని టోక్యో లేదా రాక్వెల్ రోల్స్ చేయ‌డానికి నేను చాలా ఇష్టప‌డతాను అని హీరోయిన్ ప్రియ‌మ‌ణి తెలిపారు. కానీ ప్రేక్షకులు చెప్తున్న జ‌వాన్ లోని త‌న క్యారెక్ట‌ర్ ను బ‌ట్టి చూస్తే నాకు నైరోబీ పాత్ర స‌రిగ్గా స‌రిపోతుంద‌ని అనుకుంటున్నాను అని అన్నారు ప్రియమణి. ఇకపోతే ప్రియమణి ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఢీ వంటి డాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు ప్రియమణి.