నేను నల్లగా ఉంటే ఏంటి? లావుగా ఉంటే ఏంటి? ట్రోలింగ్ మీద ప్రియమణి కౌంటర్ !

priyamani gave strong counter to trollers

కెరీర్ తొలినాళ్లలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్న ‘ప్రియమణి’ తాను కూడా బాడీ షేమింగ్ బారిన పడ్డట్లుగా ఇటీవల ఓపెన్ అయింది. పెళ్లి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన ఈ బొద్దుగుమ్మ కెరీర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో నడుస్తుంది. బుల్లితెర మీద షోస్ లో హోస్ట్ గా చేస్తూనే వెండితెర మీద దూసుకుపోతుంది. ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో నటించిన ప్రియమణి తన పాత్రతో ఆకట్టుకుంది.

priyamani gave strong counter to trollers

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అమ్మడు సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ… తనపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ చూసి ఎంతో భాధపడ్డానని చెప్పింది. పెళ్ళైన కొత్తలో తాను కాస్త బరువు పెరిగాననీ… అది చూసి అందరూ తనను అంటీ అని పిలిచారని, వయసైపోయిందని, అంతేకాకుండా నల్లగా, పందిలా ఉన్నావ్ అని కూడా కామెంట్ చేశారని షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

ఈ కామెంట్స్ కి మీడియా సాక్షిగానే ధీటుగా సమాధానమిస్తూ ట్రోలర్స్ కి చురకలంటించింది. “నేను నల్లగా ఉంటే ఏంటి? లావుగా ఉంటే ఏంటి? అది నాకు ప్రాబ్లం కానప్పుడు మీకేంటి ప్రాబ్లం అని ప్రశ్నించింది. అయినా వేరొకరి శరీరం గురించి కామెంట్ చేసేందుకు వాళ్లకేం హక్కు ఉందంటూ ట్రోలర్స్‌పై ఘాటుగా రియాక్ట్ అయింది. అప్పుడు నన్ను అలా కామెంట్ చేసినవాళ్ళే ఇప్పుడు పొగుడుతున్నారని వాళ్ళ మైండ్ సెట్ లోనే ప్రాబ్లెమ్ ఉందంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది ప్రియమణి.

ప్రస్తుతం సన్నబడి న్యూ లుక్స్ లో కనిపిస్తూ బుల్లితెరపై సందడి చేస్తున్న ప్రియమణి… త్వరలో వెండితెరమీదకు వెంకటేష్ మూవీ ‘నారప్ప’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే రానాతో కలిసి నటించిన ‘విరాట పర్వం’ మూవీ కూడా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇవేకాకుండా ‘సైనైడ్, కొటేషన్‌ గ్యాంగ్‌’ అనే సినిమాలతోపాటు హిందీ ‘మైదాన్‌’లో హీరో అజయ్‌ దేవగన్‌ సరసన నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీగా కొనసాగుతుంది.