Priyamani Bhamakalapam Trailer : ప్రియమణి ట్రైలర్ వచ్చేసింది!

Priyamani Bhamakalapam Trailer :  ప్రియమణి థ్రిల్ల‌ర్ కామెడీ వెబ్ ఒరిజిన‌ల్ ‘భామా కలాపం’ ట్రైలర్ వచ్చేసింది… ‘లైగ‌ర్’ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ విడుదల చేసిన ఈ ట్రైలర్ ‘భామాకలాపం’ లోని కంటెంట్ ని పరిచయం చేస్తోంది. రెండు వారాల క్రితం టీజర్‌తో క్యూరియాసిటీని రేకెత్తించిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు ఆసక్తికర ట్రైలర్‌ ని విడుదల చేశారు.

‘నేను వాస‌న చూసే కూర‌లో ఉప్పు ఎక్కువైందో త‌క్కువైందో చెప్పేస్తాను. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. నేను ప‌సిగ‌ట్టింది త‌ప్ప‌య్యే ఛాన్సే లేదు’ అని ప్రియమణి క్యారక్టర్ అనుపమ తన ఫ్రెండ్ తో చెప్పడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. కోల్‌క‌త్తా మ్యూజియంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు వుంచిన రూ.200 కోట్ల విలువైన‌ ఓ చారిత్రాత్మక ఎగ్ దోపిడీ అవుతుంది.

Bhamakalapam Trailer | Priyamani,  Bharat Kamma, Abhi, Robin,Justin| SVCC Digital|

 

అదెక్కండుందో క‌నిపెట్ట‌డానికి పోలీసులు సెర్చింగ్ ప్రారంభిస్తారు. ఇంతలో అపార్ట్ మెంట్ లో ఒక హత్య కూడా జరుగుతుంది. హైదారాబాద్ అపార్ట్మెంట్ లో వుండే సాధారణ గృహిణికి ఆ ఎగ్ తో, హత్యతో ఏమిటి సంబంధం? యూట్యూబ్ కుకర్ గా రకరకాల వంట రుచులు యూట్యూబ్ లో పరిచయం చేసే అనుపమ ఈ ఎగ్ దోపిడీ కేసుతో కనెక్షన్ ఏమిటనేది ఈ వెబ్ మూవీ కంటెంట్.

ఈ వెబ్ ఒరిజినల్ మూవీకి అభిమన్యు తడిమేటి దర్శకుడు. సంగీతం రాధే శ్యామ్ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్, ఛాయాగ్రహణం దీపక్ కుమార్, ఎడిటింగ్ విప్లవ్. నిర్మాతలు భరత్ కమ్మ, సుధీర్ ఈదర, బోగవల్లి బాపినీడు. బ్యానర్ ఎస్ వి సిసి డిజిటల్ ‘ఆహా’ ఓటీటీలో లో ఫిబ్రవరి 11న ప్రీమియర్ కానుంది.