Hrithik Roshan: హోంబాలే బ్యానర్ పై హృతిక్ రోషన్ మూవీ.. దర్శకుడిగా స్టార్ హీరో.. రికార్డులు బద్దలవ్వాల్సిందే!

Hrithik Roshan: హోంబాలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ బ్యానర్ పై నిర్మాత కిరగందూర్ విభిన్న చిత్రాలను తెరకెక్కించేందుకు పెద్దపీట వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కన్నడ భాషలో సినిమాలను నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సైతం ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. హోంబాలే ఫిల్మ్స్ సంస్థ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో చేతులు కలిపింది.

ఈ సంస్థ పై హృతిక్ ఒక సినిమా చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి మరింత ఆసక్తి నెలకొంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాకు ఒక స్టార్ హీరో డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నారట. అతను మరెవరో కాదు హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. పృథ్వీరాజ్, హోంబాలే ఫిల్మ్స్ మధ్య మంచి సంబంధం ఉంది.

ఇంతకు ముందు తెలుగులో వచ్చిన సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించగా హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే మూవీ సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ సినిమాకు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించనున్నారని టాక్. ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ మూవీతో తెలుగులో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు.