రౌడీ గాళ్‌గా మారిపోయిన ‘ప్రేమమ్’ బ్యూటీ.?

అనుపమ ట్రాక్ మార్చేసిందా.? గ్లామర్ తెరలు తెంచేయబోతుందా.? అంటే అవుననే అనిపిస్తోంది. అందాల అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ‘రౌడీ బాయ్స్’ సినిమాలో నటిస్తోంది. దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు.

కాగా, అర్జున్ రెడ్డి తరహాలో బోల్డ్ అండ్ రగ్గ్డ్‌డ్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో అనుపమ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చాలా హాట్‌గా కనిపించబోతోందట. ముఖ్యంగా ఈ సినిమాలోని లిప్ లాక్ సీన్స్‌పై ఇప్పుడు నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంతవరకూ తనదైన టాలెంట్‌తో క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న అనుపమ.. ఓ మోస్తరు హీరోయిన్ అని మాత్రమే అనిపించుకోగలిగింది. కానీ, ఇకపై స్టార్‌డమ్‌పై గట్టిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. స్టార్‌డమ్ దక్కాలంటే గ్లామర్ కంపల్సరీ.. అని లేట్‌గా తెలుసుకుంది కాబోలు.. గ్లామర్ తెరలు తెంచేసేందుకు, లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయేందుకు సిద్ధమైపోతోందట.

అదీ ‘రౌడీ బాయ్’ సినిమాతోనే స్టార్ట్ చేయనుందట. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకుడు, కాగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.