Pradeep Ranganathan: తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట కోలీవుడ్ లోకి కోమాలి అనే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు ప్రదీప్. ఈ సినిమా విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత లవ్ టు డే సినిమాతో హీరోగా పరిచయం అవడంతో పాటు ఆ సినిమాకు తానే దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.
అలా రెండవ సినిమాతో కూడా మంచి హిట్ సినిమాలు తన కథలో వేసుకున్నారు ప్రదీప్ రంగనాథన్. ఇలా ఒకవైపు హీరోగా మరొకవైపు దర్శకుడిగా రంగాలలో రాణిస్తూ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు ప్రదీప్. కాగా ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్‌ఐకే చిత్రంతో పాటు కీర్తీ వాసన్ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న డ్యూడ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
కాగా తాజాగా మరోసారి ఈయన మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీన్ని లవ్‌టుడే చిత్రాన్ని నిర్మించి సూపర్ హిట్ కొట్టిన ఏజీఎస్ ఎంటర్ టెయిన్‌మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు టాక్. అయితే ఈ సినిమాకి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం మాత్రమే చేస్తారా లేదంటే హీరోగా నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అకాశం ఉంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.