సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి విషయాలు ఎప్పటికీ అయోమయయే. ఎప్పుడు ప్రేమలో పడతారో, ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారో ఎవరికి అర్ధం కాదు. అప్పటి వరకు ప్రేమగా ఉన్న జంట సడెన్‌గా విడిపోతున్నాం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరిని షాక్ లో పడేస్తారు. ఇలాంటి సంఘటనలు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో చాలానే జరిగాయి. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ , దర్శకుడు ప్రభుదేవా పెళ్ళి విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభుదేవా మొదట్లో రామలతని వివాహం చేసుకున్నారు. ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ తమ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తుండగా, మధ్యలో నయనతార ఎంట్రీ ఇచ్చింది. దీంతో ప్రభుదేవా- రామలతకు మధ్య దూరం పెరిగింది. విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుదేవా- నయనతారతో చెట్టాపట్టాలు వేయడం, కలిసి టూర్స్‌కి వెళ్లడం వంటివి జరిగాయి. త్వరలో ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కుతారని కూడా అందరు భావించారు. కాని ఏమైందో ఏమో కాని నయన్ .. ప్రభుదేవాకి గుడ్ బై చెప్పి శింబుకి క్లోజ్ అయింది.
కొన్నాళ్ళుగా ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రభుదేవా తన చుట్టాల అమ్మాయితో ప్రేమలో పడ్డాడట. ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకొని పెళ్ళి పీటలెక్కాలని భావిస్తున్నారని తెలుస్తుంది. కోలీవుడ్‌లో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారగా, దీనిపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ప్రభుదేవా గత ఏడాది దబాంగ్ 3 అనే చిత్రాన్ని తెరకెక్కించగా, ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రాధే అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
నటుడిగాను ప్రభుదేవా అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం బఘీర అనే టైటిల్‌తో తన 55వ చిత్రం చేస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమైర దస్తూర్ కథానాయికగా నటిస్తుంది. చిత్రంలో ప్రభుదేవ లుక్స్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించడం ఖాయమని మేకర్స్ అంటున్నారు.