Pawan Kalyan : వైరల్ : మహేష్ కి ప్రత్యేక విషెష్ పంపిన పవర్ స్టార్.!

Pawan Kalyan : సౌత్ ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు కూడా ఒకరు. వీరిద్దరి క్రేజ్ కానీ బాక్సాఫీస్ స్టామినా కానీ సునామీలా ఉంటుంది. ఎలాంటి సినిమా అయినా టాక్ తో సంబందం లేకుండా భారీ రికార్డులు వీరు సెట్ చేస్తారు.

అయితే వీరిద్దరి నుంచి ఓ సినిమా పడితే బాగుండు అని కూడా కోరుకుంటే వారు అనేకం. ప్రస్తుతానికి అయితే ఇద్దరు హీరోలు తమ భారీ సినిమాల్లో బిజీగా ఉండగా ఇప్పుడు వారి అభిమానులకి మళ్ళీ కిక్కిచ్చే ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఇప్పుడు బయటకి వచ్చి వైరల్ అవుతుండడంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ అంత ఎగ్జైట్ అవుతున్న విషయం ఏమిటంటే రేపు క్రిస్మస్ పండుగకి గాను పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మరియు అతడి భార్య నమ్రత లకి ఒక హ్యాంపర్ ని పంపి ప్రత్యేక విషెష్ ని తెలియజేయగా వీటిని నమ్రత తన సోషల్ మీడియాలో పంచుకొని అసలు విషయం తెలియజేసారు. దీనితో ఈ ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.