తాజాగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విజయవాడ లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కొన్ని విషయాలు పంచుకున్నారు. భాజపా- జనసేన పార్టీల కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించాలి అది కూడా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించాలని కోరారు.
దీనివల్ల రెండు పార్టీల మధ్య మంచి బలం ఏర్పడి ప్రజల మద్దతు మరింత తోడ్పడుతుందని అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర పర్యటనకు వస్తున్న జేపీ నడ్డాను రాష్ట్రంలో జగన్ అవినీతి, అసమర్థతను ప్రస్తావించాలని అప్పుడే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. భాజపా కేంద్ర పెద్దలకు జగన్ పాలన నచ్చడం లేదని అన్నారు.