Samantha: సమంత డాన్స్ వీడియో పై.. పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్?

Samantha: బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా దలపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రం నుంచి అరబిక్‌ కుతు అనే పాట విడుదల కావడంతో ఈ పాట క్షణాలలో ట్రెండింగ్ గా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరి నోట చూసినా ఇదే పాట వినబడుతుంది.ఇక ఎంతో మంది ఈ పాటకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ సమంత సైతం ఈ పాటకు కాలు కదుపుతూ డాన్స్ చేసినటువంటి వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.

సమంత సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్తున్న సమయంలో ఫ్లైట్ లేట్ కావడం వల్ల సమంత ఈ పాటకు డాన్స్ వేశారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఇక ఈ డాన్స్ వీడియోని పూజ హెగ్డే, హీరో విజయ్, అదేవిధంగా బీస్ట్ చిత్ర బృందానికి ట్యాగ్ చేశారు. ఇక ఈ వీడియో పై నటి పూజా హెగ్డే స్పందిస్తూ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సమంత డాన్స్ వీడియో పై పూజ హెగ్డే స్పందిస్తూ…”సామ్.. నువ్వు అద్భుతం. నిజమే, 2022లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయేమో” అంటూ కామెంట్ చేశారు.

ప్రస్తుతం సమంత డాన్స్ వీడియో పై పూజ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకొని సినిమాపై ఎన్నో అంచనాలు పెంచాయి. ఇక పూజా హెగ్డే వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అదేవిధంగా సమంత కూడా విడాకులు ప్రకటన తర్వాత వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరీర్ లో బిజీగా ఉన్న సమంత నిత్యం సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్టు ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.