మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ..!

అక్కినేని అఖిల్ – పూజ హెగ్డే హీరో, హీరోయిన్స్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అఖిల్ కెరీర్ లో 4 వ సినిమా వస్తుండగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జి.ఏ2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కంప్లీట్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి అఖిల్ పూజా హెగ్డే ల ఆన్ స్క్రీన్ రొమాన్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని యూనిట్ నమ్మకంగా ఉన్నారు.

Image

ఇక ఇప్పటికే రెండు పోస్టర్స్ ని రిలీజ్ చేసి సినిమాని ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే లుక్ రిలీజ్ చేస్తూ మేకర్స్ విషెస్ ని తెలిపారు. ఈ పోస్టర్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమా ఇప్పటికే దాదాపు చిత్రీకరణ కంప్లీటయిందని సమాచారం. సంక్రాంతి బరిలో ఈ సినిమాని దింపాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు పూజా హెగ్డే డార్లింగ్ ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రెండు బాలీవుడ్ సినిమాలు కమిటయింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రీకరణలో భాగంగా యూరప్ లో ఉంది పూజా హెగ్డే.