Pooja Hegde : పచ్చి మాటలతో బుక్కైన పూజా హెగ్డే..సమంతా ఇద్దరి వీడియోలు వైరల్.!

Pooja Hegde : కొన్ని కొన్ని సార్లు ఆదమరుపులో ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట అనేస్తే అది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. అయితే సామాన్యులు అనుకుంటే అక్కడికక్కడే ఒక ఇద్దరు ముగ్గురుతో పోతుంది. కానీ ఎంతో ఫేమ్ ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది.
ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి మాట రికార్డెడ్ గానే ఉంటుంది. అందుకే వారికి ఆ అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ ఒకోసారి వారి కొంప కూడా మునుగుతుంది. ఇప్పుడు అలాగే పూజా హెగ్డే సోషల్ మీడియాలో బుక్కైపోయింది. లేటెస్ట్ తాను రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో “సక్సెస్” అనే పదం అనబోయి..
ఇంకో మాట ఏదో అనేసింది(మీకు అర్ధం అయ్యే ఉండొచ్చు) మళ్ళీ వెంటనే మాట మార్చి కంటిన్యూ చేసింది. ఏదైతే ఏంటి ఆ బిట్ అయితే రికార్డు అయ్యిపోయింది. దీనితో ఆ వీడియో క్లిప్ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మరి ఇదంతా బాగానే ఉంటే మరి సమంతా పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా?
దీనికీ కారణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పూజా హెగ్డే కి ఎదురైన పరిస్థితే సేమ్ గత కొన్నాళ్ల కితం సమంతాకి ఎదురవ్వగా ఈమె కూడా పూజా హెగ్డే లానే మాట జారేసింది. దీనితో ఇప్పుడు పూజా వీడియో లేటెస్ట్ గా వైరల్ కాగా మళ్ళీ సమంతా వీడియో కలిపి నెటిజన్స్ షేర్ చేసుకుంటున్నారు.