Posani: పోసాని కృష్ణమురళి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. బుధవారం రాత్రి హైదరాబాద్లోని పోసాని నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనని ఉన్న ఫలంగా అరెస్టు చేసి తీసుకువెళ్లారు అయితే ఆయన వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా పోలీసులు మెడికల్ టెస్టులని విచారణ అంటూ ఈరోజు తెల్లవారుజామున వరకు తిప్పుతూనే ఉన్నారు.
గత రాత్రి పోసాని కృష్ణ మురళిని కోర్టులో హాజరు పరచగా నేడు ఉదయం 5 గంటల వరకు వాదోపవాదములు జరిగాయి. ఇలా వాదనల అనంతరం రైల్వే కోడూరు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు ఈయనకు రిమాండ్ విధించినట్లు కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయనని కడప జైలుకు తరలించారు.
ఇక పోసాని గతంలో నంది అవార్డుల గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై ఈయన పట్ల కేసు నమోదు అయ్యాయి. సినీ పరిశ్రమకు కులాలను ఆపాదిస్తూ నంది అవార్డుల ప్రతిష్ఠను మంటగలిపారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఆధారంగానే ఆయననే అరెస్టు చేసి జైలుకు పంపించారు.
పోసాని అరెస్టుకు కొద్ది నెలల ముందే పార్టీకి రాజీనామా చేశారు ఇలా పార్టీకి రాజీనామా చేసినప్పటికీ ఆయనని అరెస్టు చేయడంతో వెంటనే జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఫోన్లో పోసాని భార్యతో మాట్లాడి ఆమెకు ధైర్యం ఇవ్వడమే కాకుండా వైసీపీ ప్రదాన కార్యదర్శిగా ఉన్న ప్రముఖ న్యాయవాదిని పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పోసానికి అండగా పంపించారు. పోసానికి బెయిల్ ఇప్పించాల్సిందేనని జగన్ ఆదేశాలు జారీ చేయడంతో పొన్నలోలు శక్తివంచన లేకుండా దాదాపు 8 గంటల పాటు వాదనలో వినిపించారు.
ఇక ఈ వాదనల అనంతరం కూడా ఈయనకు జైలు శిక్ష పడిపడింది. ఇలా పోసానికి రిమాండ్ విధించడంతో పొన్నవోలు కూడా ఆయన విషయంలో సక్సెస్ కాలేకపోయారని తెలుస్తోంది.దీంతో శుక్రవారం ఉదయం పోసానిని పోలీసులు కడపలోని కేంద్ర కారాగారానికి తరలించారు.
