రాజకీయం నా నుంచి దూరం కాలేదు.. వైరల్ అవుతున్న మెగా ట్వీట్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన మోహన్ రాజా దర్శకత్వంలో నటించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. మోహన్ రాజు దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ రీమేక్ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా కానుకగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాలో ఒక డైలాగ్ ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఆడియో ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ కాస్త రాజకీయాల పరంగా తీవ్రదుమారం రేపుతుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఈయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ.. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ వాయిస్ ఓవర్ తో ఉన్నటువంటి ఒక డైలాగ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది చూసిన పలువురు నెటిజన్స్ మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి డైలాగ్ ట్వీట్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి ఈయనతిరిగి రాజకీయాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారా తిరిగి రాజకీయాలలోకి రాబోతున్నారా అంటూ పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం సినిమాలో బాగమేననీసినిమా ప్రమోషన్ కోసం సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ ను ఇలా ఈయన ఉపయోగించారని తెలుస్తోంది.ఇక చిరంజీవి ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఆయన అభిమానులు అందరూ గాడ్ ఫాదర్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు మరి ఈ సినిమా అభిమానులకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.