“సానియా మీర్జా” ఫామ్ హౌస్ దగ్గర కాల్పుల కలకలం

police file case on shootings that are allegedly sania mirza farm house

తెలంగాణ: తాజాగా వికారాబాద్ అడవుల్లో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. పోలీసుల విచారణలో ఓ సెలబ్రెటీ ఫామ్ హౌస్ వద్దే ఇది జరిగిందని తేలింది.

దామగుండంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అలాగే ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఆ ఫామ్ హౌస్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

police file case on shootings that are allegedly sania mirza farm house
sania miza

ఫామ్ హౌస్ దరిదాపుల్లోకి పశువులు తీసుకొని రావద్దు అంటూ నిర్వాహకులు తమను బెదిరిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా ఫాంహౌస్ నిర్వాహకులు సిబ్బందిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో కాల్పుల ఘటనపై కీలక సమాచారం సేకరించారు.

స్వాధీనం చేసుకున్న బుల్లెట్ ఏ రివాల్వార్ నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. ఆవుకు బుల్లెట్ గాయాల ఘటన తర్వాత ఫాంహౌస్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఫాంహౌస్ కు చెందినవారే కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.