ఇన్నేళ్ల తర్వాత ..యూఎస్ లో “పోకిరి” కి భారీ రెస్పాన్స్.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర చెక్కు చెదరని భారీ హిట్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు పూరి జగన్నాద్ ల కెరీర్ లో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం “పోకిరి” కూడా ఒకటి. ఇద్దరి కెరీర్ లో కూడా ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ గా వచ్చిన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ హిట్ అంతే..

అందుకే ఇన్నేళ్లు అయినా కూడా ఈ సినిమాకి మాస్ క్రేజ్ అలాగే ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఈ ఆగస్ట్ 9న కాగా ఈ స్పెషల్ డే కి గాను అభిమానులు భారీ స్థాయిలో పోకిరి స్పెషల్ షోస్ ని ప్లాన్ చేశారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆల్రెడీ పోకిరి కొత్త ప్రింట్ మరింత సాలిడ్ విజువల్స్ మరియు సౌండ్ తో రానుండగా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమాకి షాకింగ్ రెస్పాన్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది.

యూఎస్ లో కాలిఫోర్నియా సినీ లాంజ్ లో సినిమా స్పెషల్ షోకి బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా దీనికి భారీ రెస్పాన్స్ తో టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయ్యిపోయాయట. అంతే కాకుండా డిమాండ్ ఎక్కువ కావడంతో మరిన్ని స్క్రీన్స్ లో యాడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికి అయితే మళ్ళీ పండుగాడు మాస్ మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. ఇంకా ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు హీరోయిన్ ఇలియానా కి కూడా భారీ బ్రేక్ ఇచ్చిన సినిమా కూడా ఇదే. దీనితో ఆమె ఫస్ట్ టైం తెలుగులో 1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డు కూడా సెట్ చేసింది.