Pitapuram: పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఈ పేరు గత ఏడాది మార్చి నుంచి సోషల్ మీడియాలో తెగ మారు మోగిపోయింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న విషయాన్ని ప్రకటించడంతో అప్పటినుంచి అక్కడ అభిమానులు పిఠాపురం ప్రజలు ఇక గెలుపు పవన్ కళ్యాణ్ దేననీ భావించి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్టిక్కర్స్ వేసుకొని తిరగడం మొదలుపెట్టారు. ఇలా బైక్ కార్ ఆటోలకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్టికర్ కనిపించేది.
ఇప్పటికీ కూడా ఈ టైటిల్ కి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారడంతో డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ కూడా స్టిక్కర్లు బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ మరొక హీరో ఏకంగా తన సినిమాకే టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది అయితే ఈ సినిమాకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని టైటిల్ పెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక వీరాభిమాని తన అభిమాన హీరోని కలుసుకునే క్రమంలో దారి మధ్యన జరిగే ప్రయాణంని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ చూస్తే కనుక రామ్ విభిన్న పాత్రలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది.
ఇక ఈ సినిమాకు ఆంద్ర కింగ్ గారి తాలూకా అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. నిజానికి ఎమ్మెల్యే గారి తాలూకా అనే టైటిల్ ను ఆదర్శంగా తీసుకొని ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ గారి తాలూకా అనే టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము తమ అభిమాన హీరో కోసం క్రియేట్ చేసిన టైటిల్ ని గుర్తించి, ఏకంగా రామ్ లాంటి యంగ్ హీరో తన సినిమాకి అలాంటి టైటిల్ ను పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.