Peddireddy Vs Chandrababu : పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు.. ఎవరు గెలుస్తారు చెప్మా.?

Peddireddy Vs Chandrababu : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం నుంచి పోటీ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరిన విషయం విదితమే. దానికి మంత్రి పెద్దిరెడ్డి కూడా స్పందిస్తూ ప్రతి సవాల్ విసిరారు.. పుంగనూరు నుంచి చంద్రబాబు పోటీ చేయాలన్నారు పెద్దిరెడ్డి. అంతేనా, కుప్పంలో తన అటెండర్‌ని నిలబెట్టి, చంద్రబాబు మీద గెలిపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

పెద్దిరెడ్డిని గెలవనిచ్చే ప్రసక్తే లేదనీ, ఓడించి తీరతాననీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఇరువురి మధ్యా సవాళ్ళు, ప్రతిసవాళ్ళు నడుస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో పెద్దిరెడ్డి వ్యూహం ఫలించి చంద్రబాబుకి షాక్ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి వ్యూహం పక్కాగా వైసీపీకి వర్కవుట్ అయ్యింది.

పెద్దిరెడ్డి సీనియర్ పొలిటీషియన్. ఆ విషయం అందరికీ తెలిసిందే. చిత్తూరు జిల్లా దాటి పెద్దిరెడ్డి రాజకీయ వ్యూహాలు ఆంధ్రప్రదేశ్ అంతటా వైసీపీకి కలిసొచ్చాయి స్థానిక ఎన్నికల్లో. అది చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్న విషయం. అందుకే, పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు.

ఎంతలా పెద్దిరెడ్డిని చంద్రబాబు రెచ్చగొడితే, అంతలా చంద్రబాబు రాజకీయ జీవితం సర్వనాశనమైపోతోంది. దానికి స్థానిక ఎన్నికలే నిదర్శనం. ఇప్పుడిక 2024 ఎన్నికలపై ఇరువురూ సవాళ్ళు విసురుకుంటున్నారు. అసలే కుప్పంలో పరిస్థితులు చంద్రబాబుకి ఏమంత సానుకూలంగా లేవు. ఇలాంటి తరుణంలో పెద్దిరెడ్డిని సవాల్ చేయడం అవసరమా చంద్రబాబుకి.?