పాయల్ ముద్దు కోసం పాకులాడిన ఆది.. పాయల్ చేసిన పనికి ఆది పరువు పోయిందిగా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా జబర్దస్త్ లాగా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న ఈ షోలో జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రసారం అవుతున్నాయి ఈ షోలో వచ్చి గెస్ట్ లను ఆకట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో తీస్ మార్ ఖాన్ సినిమా యూనిట్ సందడి చేసింది.

హీరో ఆది సాయి కుమార్, హీరోయిన్ పాయల్
రాజ్‌పుత్‌ ఈ షో లో సందడి చేశారు. ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పాయల్ తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాయల్ అందాల ఆరబోత కుర్ర కారుకి పిచ్చెక్కించింది. ఇలా తన అభినయంతో పాటు అందంతో కూడా పాయల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస సినిమా అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో ఆది సాయికుమార్ సరసన తీస్ మార్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా ఆగష్టు 19 న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆది, పాయాల్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సందడి చేశారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది చేసే సందడి గురించి అందరికీ తెలిసిందె. ఇక ఈ ఎపిసోడ్ పాయల్ రాజ్పుత్ రావటంతో ఆది అల్లరికి హద్దు లేకుండా పోయింది. నరేష్ చిన్నపిల్లాడిలా ఉండటంవల్ల అందరూ అతనిని చిన్నపిల్లాడిగా భావిస్తుంటారు. దీంతో పాయల్ రాజ్ పుత్ కూడా నరేష్ ని చిన్నపిల్ల అడిగా భావించి అతని చెంపకు ముద్దు పెట్టినట్టు చెంపని అనించి ముద్దు పెట్టేసింది. దీంతో ఆది కూడా రెచ్చిపోయి పాయల్ ముద్దు కోసం పాకులాడాడు. ఈ క్రమంలో ఆది అలాంటిదే నాకు కూడా ఒకటి ఇవ్వు పనైపోద్దన్నట్టుగా ముందుకు వచ్చాడు. పాయల్ కూడా ఏ మాత్రం తగ్గకుండా నరేష్ చెంపకు తన చెంప ఆనిచ్చినట్టు.. ఆది చెంపకు కూడా ఆనిచ్చి బ్రదర్ అనేసింది. పాయల్ అల అనటంతో ఆది పరువు పోయినట్టు అయ్యింది.