పాయల్ గ్లామర్ సెగల్: ఇంకోస్సారి..

Payal Glamorous Treat Again | Telugu Rajyam

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో కుర్రకారు గుండెల్లో గ్లామర్ సెగలు పుట్టించిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత ‘ఆర్ డీ ఎక్స్ లవ్ స్టోరీ’ అంటూ మరోసారి తనలోని గ్లామర్ యాంగిల్ చూపించి కిక్కిచ్చింది. ఆ పై విక్టరీ వెంకటేష్‌తో ‘వెంకీ మామ’, మాస్ రాజా రవితేజతో ‘డిస్కోరాజా’ తదితర సినిమాల్లో నటించింది.

కానీ, ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించలేకపోయింది. ఈ క్రమంలోనే ‘బుల్ రెడ్డీ..’ అంటూ ఓ ఐటెం సాంగ్ కూడా కానిచ్చేసింది. అప్పుడప్పుడూ సినిమాలతో పాటు, సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ హాట్‌గా హీటు సెగలు పుట్టిస్తూనే ఉంది. అయితే చాలా రోజులుగా కాస్త కామ్‌గా ఉన్న పాయల్ వేడి వేడి‌గా మరోసారి తన గ్లామర్‌తో హీటు పుట్టించేందుకు రెడీ అయ్యింది.

ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న ‘తీస్ మార్ ఖాన్’ అనే సినిమాలో పాయల్ రాజ్ ‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలోంచి ఓ రొమాంటిక్ లుక్‌ని చిత్రయూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. బీచ్‌లో కూర్చొని ఆదితో ఓ రొమాంటిక్ స్టిల్‌ ఇచ్చుకుంది హాట్ హాట్ పాయల్. ఈ స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి కళ్యాణ్.జి.గోగణ దర్శకుడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles