స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ హిట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని చాలా కథలే విన్నారు. కొన్ని కథలను ఓకే చేశారు. వాటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్ – కనబడుటలేదు’ అనే సినిమా కూడ ఉంది. ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ అయింది కానీ ఇంతవరకు రెగ్యులర్ అప్డేట్స్ మొదలుకాలేదు. మధ్యలో అసలు ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు కూడ వచ్చాయి. ఈలోపు బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా కమిటయ్యారు. దీంతో ‘ఐకాన్’ ఉండదని దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది.
ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి రీజన్ వేణు శ్రీరామ్ మీద అంతగా నమ్మకం లేకపోవడమే అనే టాక్ నడిచింది. అంత పెద్ద కథను అతను హ్యాండిల్ చేయగలడా లేదా, బన్నీని పాన్ ఇండియా లెవల్లో ప్రజెంట్ చేయగలడా లేదా అనే అనుమానాలు ఉండేవట. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. వేణు శ్రీరామ్ ఏకంగా ‘వకీల్ సాబ్’ సినిమాతో పవన్ ను హ్యాండిల్ చేసేశాడు. పవన్ సైతం వేణు శ్రీరామ్ వర్క్ మీద ప్రశంసలు కురిపించారు. దీంతో ఆయన క్యాపబిలిటీ మీద ఉన్న అనుమానాలు పటాపంచలు అయిపోయాయి. ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న ‘వకీల్ సాబ్’ హిట్ అయితే మాత్రం అతను స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోతాడు.
అందుకే ‘ఐకాన్’కు లైన్ క్లియర్ అయిపోయింది. సినిమాను చేయడానికి బన్నీ సుముఖంగా ఉన్నాడట. నిర్మాత దిల్ రాజు సైతం వేణు శ్రీరామ్ మాత్రమే ‘ఐకాన్’ దర్శకుడని బల్లగుద్ది చెప్పేశారు. సో..పవన్ పుణ్యమా అని వేణు శ్రీరామ్ చేతి నుండి ‘ఐకాన్’ జారిపోలేదు.