సెన్సేషనల్ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ సినిమా.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా బిజీగా ఉన్నాడు. ఓ పక్క సినిమాలు ఇంకో పక్క పాలిటిక్స్ చేస్తూ జోడు గుర్రాల స్వారీ చేస్తున్నాడు. అయితే ఆల్రెడీ పలువురు టాప్ టాలీవుడ్ దర్శకులతో పవన్ సినిమాలు ఇప్పుడు ఫిక్స్ అయ్యి కొన్ని షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు రేస్ లోకి ఓ ఊహించని సెన్సేషనల్ కాంబో సెట్టయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

అదే మళ్ళీ పవన్ మరియు నిర్మాత దిల్ రాజు అలాగే కంటిన్యూస్ ఎంటర్టైనింగ్ హిట్ దర్శకుడు అనీల్ రావిపూడి ల కాంబోలో ఓ సినిమా కన్ఫర్మ్ అయ్యిందట. లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనీల్ రావిపూడి ఈ విషయం తెలిపాడు. తాను మెగాస్టార్ తో సినిమా పవన్ తో ఓ సినిమా కమిట్ అయ్యినట్టుగా తెలుపగా ఇప్పుడు వీటిలో ఆల్రెడీ పవన్ తో సినిమాని దిల్ రాజు తన బ్యానర్ లో నిర్మిస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది.