గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సహా గెస్ట్ రోల్ లో చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తమిళ హిట్ సినిమా “వినోదయ సీతం” రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ లో పవన్ తన పోర్షన్ ని కంప్లీట్ చేయగా దీనికి ప్రముఖ టాలెంటెడ్ నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే సముద్రఖని కి మన తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన మొదటి డబ్బింగ్ సినిమా తెలుగులో రఘువరన్ బి టెక్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న తాను మరెన్నో సినిమాల్లో నటించారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా పవన్ మరియు తాను కలిసి మొదటిసారిగా “భీమ్లా నాయక్” లో వర్క్ చేశారు.
ఇప్పుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్ నటిస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా ఈ ఇద్దరికీ చాలా కాలం కితం నుంచి కూడా పెద్దగా ఎలాంటి బంధం లేదు అయినా కూడా ఈ ఇద్దరూ ఎంతలా కలిసిపోయారా అని అందరూ ఆశ్చర్యపోయేలా పవన్ ప్రెస్ నోట్ తో షాకిచ్చాడు.
ఐతే సముద్రఖని ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగుడుతూ పవన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయగా దీనికి సముద్రఖని కూడా ఇంట్రెస్టింగ్ ప్రెస్ నోట్ ని వదిలాడు.
“అన్నయ్యా, నా పట్ల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని. మీతో నటుడిగా దర్శకుడిగా ఈ ప్రయాణం ఎన్నో మంచి విషయాలను నేర్పించింది. మరింత గొప్పగా కొనసాగేందుకు కావలసిన ధైర్యాన్ని చైతన్యాన్ని నాలో నింపింది. ముఖ్యంగా సమాజం పట్ల మీకున్న ప్రేమ అక్కర నన్ను మీ వ్యక్తిత్వానికి అభిమానినయ్యేలా చేసింది.
సదా మీలాంటి సాహస యోధుడి ఆలోచనలకు దృక్పథానికి సహచరుడిపై ఉండాలని కోరుకుంటాను. ప్రజాశ్రేయస్సుకై మీరు కలలుగనే మార్పు సాకారమై, తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ భారతదేశానికి మేలు జరిగే దిశగా ఆ భగవంతుడు మిమ్మల్ని నడిపించాలని మీకు శక్తి ప్రసాదించాలని ప్రార్ధిస్తాను.” అని సముద్రఖని తెలిపారు. దీనితో అసలు పవన్ కి ఈయనకి ఇంత స్ట్రాంగ్ బంద్ ఉందా అని చాలా మంది ఆశ్చర్యఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️…. pic.twitter.com/1czuBzRI5J
— P.samuthirakani (@thondankani) April 27, 2023