టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “అంటే సుందరానికి”. “బ్రోచేవారెవరురా” ఫేమ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఫహద్ నటించింది.
అయితే మంచి అంచనాలు నెలకొన్న ఈ సినిమా రేపు జూన్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా ఇపుడు ఈ సినిమా ఓటిటి హక్కులకు సంబంధించి వైరల్ అవుతున్న రూమర్స్ పై క్లారిటీ బయటికి వచ్చింది. ఈ సినిమాని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు భారీ ధర ఇచ్చి సొంతం చేసుకున్నారట.
అలాగే దీనిని కూడా లేటెస్ట్ ట్రెండ్ లో భాగంగా 8 వారాల తర్వాతే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి డీల్ పై అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించగా నరేష్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించారు.