ఇండస్ట్రీ బజ్ : ఓటిటిలో “విక్రమ్” విడుదలకి డేట్ కన్ఫర్మ్ అయ్యిందా??

ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కీలక పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇంకా ఫహద్ ఫాజిల్ లాంటి విలక్షణ నటులు నటించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “విక్రమ్”. దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా అయితే తమిళ నాట రికార్డుల దుమ్ము లేపుతుంది. 

మరి ఇంకా థియేటర్స్ లో భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం తెలుగులో కూడా మంచి వసూళ్ళని అందుకుంటుంది. మరి ఇప్పుడు సినిమా మూడో వారం లోకి ఎంటర్ అయ్యిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై తమిళ సినీ వర్గాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రం ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ హాట్ స్టార్ వారు అన్ని భాషల్లో కొనుగోలు చేసేసారు. 

ఇప్పుడు ఇందులో ఎప్పుడు నుంచి ఆడియెన్స్ కి అందుబాటులో వస్తుందో ఇప్పుడు తెలుస్తుంది. మేకర్స్ అయితే ఈ సినిమాని జూలై 8 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇది అధికారిక డేట్ అయితే కాదు మరి దీనిపై సరైన క్లారిటీ రావాల్సి ఉంది. మరి వేచి చూడాలి అప్పుడే వస్తుందా లేక వేరే ఎప్పుడైనా వస్తుందేమో అనేది.