అప్పుడే నానీ “అంటే సుందరానికీ” ఓటిటి డేట్ ఫిక్స్ అయ్యిపోయిందా?

నాచురల్ స్టార్ హీరో నాని హీరోగా మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “అంటే సుందరానికీ” కోసం తెలిసిందే. యంగ్ ఫిల్మ్ మేకర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ని అందుకుంది. 

అయితే తెలుగు స్టేట్స్ లో సినిమాకి మంచి వసూళ్లు రాలేదు కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం గట్టెక్కేసింది. మరి మన దగ్గర సినిమాకి జరిగిన బిజినెస్ కి తగ్గ వసూళ్లు రాకపోవడం ఒకింత బాధాకరమే కానీ నాని మరియు చిత్ర యూనిట్ మాత్రం సినిమా ఫీడ్ బ్యాక్ పట్ల ఆనందంగానే ఉన్నారు. 

మరి ఎలాగో థియేటర్స్ లో ప్రేక్షకులు సినిమా చూడడం లేదు. దీనితో ఓటిటి రిలీజ్ డేట్ ఇప్పుడు ఫిక్స్ అయ్యినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రం ఈ జూలై 8 నుంచి ఓటిటిలో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. 

ఈ సినిమా ఓటిటి హక్కులు ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసారు. అందులో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రానుంది. ఇంకా దీనిపై అయితే అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.