వంటింట్లో గ్యాస్ ధర భారీగా పెరిగింది. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు మోతతో సామన్యుడు అల్లాడుతుంటే.. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడంతో లబోదిబోమంటున్నారు. 14 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి . ప్రస్తుతం హైదరాబాద్‌లో 14 కేజీల సిలిండర్ ధర రూ.1002కి చేరింది. ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో చమురు సంస్థలు ధరలు పెంచినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐదు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెంచుతున్నట్లు డీలర్లకు సమాచారం అందిందింది
భారీగా పెరిగిన సిలిండర్..ఇంధన ధరలు
