బాలయ్యతో జత కట్టనున్న ‘ఓబులమ్మ’.. నిజమేనా.?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా దాదాపు ఈ జనరేషన్ స్టార్ హీరోలందరి సరసనా నటించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్‌కి ఈ మధ్య టాలీవుడ్‌లో ఆపర్లు తగ్గిన సంగతి తెలిసిందే. కెరీర్ డల్ అయిన సందర్భంలో అగ్ర హీరో నాగార్జున సరసన ‘మన్మధుడు 2’ సినిమాలో నటించి విమర్శల పాలైంది రకుల్ ప్రీత్ సింగ్.

ఇక, తాజాగా ‘కొండపొలం’ సినిమాలో ఫ్రెష్ హీరో వైష్ణవ్ తేజ్‌‌తో స్ర్కీన్ షేర్ చేసుకుని ఆదరహో అనిపించింది. నిజంగా రకుల్‌కి ఈ సినిమా అసలు సిసలు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పక తప్పదు. ఫ్రెష్ అప్పీల్‌తో పాటు మంచి సక్సెస్ కూడా తన ఖాతాలో వేసుకుంది. ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకుల మనసులే కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఇక ఈ సక్సెస్ టాలీవుడ్‌లో రకుల్‌ను మరోసారి సెటిల్ చేసేందుకు ఓ బెస్ట్ ఛాన్స్ అనిపించేలానే ఉంది. ఈ క్రమంలో అగ్ర హీరో బాలయ్య దృష్టి రకుల్‌పై పడినట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న చిత్రంలో రకుల్ పేరు పరిశీలనకొచ్చిందట. ‘అఖండ’ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రమిది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఫిక్సయితే ఆమె దశ తిరిగినట్లే. చూడాలి మరి, ఓబులమ్మ లక్ ఎలా ఉందో.