కరోనా కాలం మొదలైన తర్వాత మెగాస్టార్ చిరంజీవిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చిరు అంటే అందరివాడు అనే పేరుండేది. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరివాడు అయిపోయాడు. అప్పుడు చేసిన కొన్ని పనులు ఆయన్ని ఓ వర్గానికి దూరం చేసింది. హార్డ్ కోర్ అభిమానులు కూడా చిరంజీవికి దూరంగా జరిగారు. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే ఆయన్ని రాజకీయ నాయకుడిగా ఒప్పుకోని వాళ్లు కూడా ఒక్కసారి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ అందరివాడు అంటున్నారు. అన్నయ్య అన్నయ్య అంటున్నారు. పైగా చిరు కూడా సినిమా ఇండస్ట్రీకి దాదాపు 9 ఏళ్లు దూరమయ్యాడు. అప్పుడు ఎవర్నీ పట్టించుకోలేదు. తన రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ గత మూడేళ్ల నుంచి పూర్తిగా పెద్ద అయిపోతున్నాడు. ఇక్కడ కష్టనష్టాలు మాట్లాడుతున్నాడు.. ముందుండి నడిపిస్తున్నాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ముందుకు వెళ్తున్నాడు. పెద్దదిక్కులా మారిపోతున్నాడు.
అప్పుడు దాసరి చేసినట్లు ఇప్పుడు చిరంజీవి కూడా ముందడుగు వేస్తున్నాడు. అందుకే ఆయన్ని మరో దాసరి అంటున్నారు ఇండస్ట్రీలో కొందరు కూడా. ముఖ్యంగా కరోనా సమయం వచ్చిన తర్వాత ఈయనలో చాలా మార్పు కనిపించింది. కరోనా క్రైసిస్ ఛారిటీ ఒకటి మొదలు పెట్టి అందులో అందరికీ సాయం చేస్తున్నాడు. పేద కళాకారులతో పాటు ఫిల్మ్ జర్నలిస్టులకు కూడా తోచిన సాయం చేస్తున్నాడు. ప్రతీ నెల వాళ్లకు సరుకులు ఇస్తున్నాడు. కరోనాలో అందరికీ తోడుగా ఉంటున్నాడు చిరంజీవి. దాంతోపా