విజయ్ సేతుపతి కాదు ‘ఫ.ఫా’నే చేస్తున్నాడు

Not Vijay Sethupathi Fahadh Fassil doing villain role in Vikram

Not Vijay Sethupathi Fahadh Fassil doing villain role in Vikram

కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న కొత్త చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే సినిమా సన్నిహిత వర్గాల సమాచారం మేరకు సేతుపతి ఇందులో నటించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇందులో విలన్ ఎవరయ్యా అంటే ఫహద్ ఫాజిల్. మలయాళంలో స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ఫహాద్ ఫాజిల్. ఈయనే సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నాడు. ఈ వార్త వందకు వంద శాతం ఖాయమని తెలుస్తోంది.

విజయ్ సేతుపతి ప్రజెంట్ చాలా బిజీగా ఉన్నారు. తమిళంలోనే ఆయనకు ఏడెనిమిది సినిమాలున్నాయి. పాత కమిట్మెంట్స్ మూలాన కొత్త సినిమాలకు డేట్స్ కేటాయించలేక ఆమిర్ ఖాన్ సినిమా, అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కూడ వదులుకున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే ‘పుష్ప’లో కూడ ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా చేస్తున్నారు. సో.. సేతుపతి విలన్ రోల్ చేస్తారనే టాక్ ఉన్న రెండు పెద్ద సినిమాల్లోనూ ఫహాద్ ఫాజిలే నటిస్తున్నాడు.