“కేజీఎఫ్ 2” కాదు “కేజీఎఫ్ 1” వచ్చిన రెస్పాన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇండియన్ సినిమా సీక్వెల్ సినిమాలు ఏ భాషలో తీసినా కూడా పెద్దగా ఆడవు అనే మార్క్ కి అతీతంగా కొన్ని సినిమాలు హిట్ అయ్యి చూపించాయి కానీ అన్నిటికన్నా ఎక్కువ నమ్మకం ఇచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఏదన్నా ఉంది అంటే అది మన తెలుగు సినెమాలు బాహుబలి 1 మరియు బాహుబలి 2 సినిమాలు అనే చెప్పాలి.

ఈ సినిమాల వల్లనే కేజీఎఫ్ లాంటి సినిమాలు కూడా సీక్వెల్స్ తో పుట్టుకొచ్చాయి. మరి ఇప్పుడు ఈ కేజీఎఫ్ సినిమాలు కూడా ఎలాంటి రెస్పాన్స్ కొల్లగొట్టాయో చూసాము. ఇప్పుడు కేజీఎఫ్ 2 సినిమా భారీ వసూళ్లు అందుకోగా ఆ సినిమా సక్సెస్ పక్కన పెడితే కేజీఎఫ్ 1 కి వచ్చిన షాకింగ్ రెస్పాన్స్ చూస్తే మతి పోతుంది.

యూట్యూబ్ లో ఈ సినిమాని భోజ్ పూరి వెర్షన్ లో రిలీజ్ చెయ్యగా ఏకంగా వరల్డ్ లెవెల్ రెస్పాన్స్ ని ఈ సినిమా కొల్లగొట్టిందట. ఇంతకీ ఈ సినిమాకి ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే ఇప్పటి వరకు 615 మిలియన్ వ్యూస్ ని ఈ చిత్రం అందుకొని కొనసాగుతుంది.

ఇది ఇండియన్ సినిమాల దగ్గరే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ రెస్పాన్స్ అని తెలుస్తుంది. మొత్తానికి అయితే ప్రశాంత్ నీల్, యష్ మరియు శ్రీనిధి శెట్టి ల కాంబో ఊహించని సెన్సేషన్ ని నమోదు చేసిందని చెప్పాల్సిందే.