ఎంత దూరంలో ఉన్న ఎప్పటికీ మా బంధం ముగిసిపోదు… సుధీర్ పోస్ట్ వైరల్!

బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సుదీర్ ప్రస్తుతం వరస బుల్లితెర కార్యక్రమాలతోనూ అలాగే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ ప్రస్తుతం ఈటీవీకి దూరమై స్టార్ మాకు దగ్గరయ్యారు. ఇలా స్టార్ మాలో పలు కార్యక్రమాలతో బిజీగా ఉండటమే కాకుండా పలు సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.అయితే తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన ఈ టీవీని వదిలి రావడంతో ఈయన గురించి ఎన్నో వార్తలు షికార్లు చేశాయి.

ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో గెటప్ శ్రీను సుడిగాలి సుదీర్ వెళ్లిపోవడంతో ఆటో రాంప్రసాద్ ఒక్కడే ఇన్ని రోజులు స్కిట్లు చేస్తూ వచ్చారు. ఇకపోతే గత రెండు వారాల నుంచి గెటప్ శ్రీను తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేయడంతో త్వరలోనే సుదీర్ కూడా వస్తారని భావించారు. అయితే తాజాగా సుదీర్ చేసిన పోస్ట్ చూస్తుంటే మాత్రం ఈయన తిరిగి ఈ కార్యక్రమంలో రారని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే సుదీర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీనుతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశారు.

ఈ సందర్భంగా సుధీర్ ఈ ఫోటోని షేర్ చేస్తూ… నా బలం, నా సంతోషం, నా చిలిపితనం అంతా మీతోనే.. నేను ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడున్న ఎప్పటికీ మన బంధం ముగిసిపోదు అంటూ ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. ఈ విధంగా సుధీర్ ఈ పోస్ట్ చేయడం చూస్తుంటే పరోక్షంగా ఈయన వారికి దగ్గర కాలేరని, వారితో పాటు తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేయరని తెలుస్తుంది. ఏది ఏమైనా సుధీర్ ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను మధ్య ఉన్న రిలేషన్ బయట పెడుతూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.