Pushpa: సెకండ్ వేవ్ దెబ్బకు తెలుగు సినీ ఇండస్ట్రీ దాదాపు మూతబడింది. రెండు మూడు సినిమాలు మినహా అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఇంకొన్నాళ్లు ఏవీ మొదలయ్యేలా కనబడట్లేదు. ఎక్కడా ఎవ్వరూ కొత్త చిత్రాలను స్టార్ట్ చేయట్లేదు. నిర్మాతలు మండలి సైతం మరీ అవసరం అయితే 50 మంది బృందంతో షూటింగ్ జరుపుకోమని తెలిపింది.
కానీ సుకుమార్ మాత్రం ‘పుష్ప’ చిత్రాన్ని నడిపిస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్ వైపు నుండి కూడ పూర్తి సహకారం ఉండటంతో సుక్కూ చెలరేగిపోతున్నారు. నిజానికి గతేడాదిలోనే రావాల్సిన సినిమా లాక్ డౌన్ దెబ్బకు వాయిదాపడింది. మళ్ళీ ఇండస్ట్రీ మొదలయ్యాక ఆగష్టు 13ను కొత్త తేదీగా నిర్ణయించారు. ఈసారి ఈ డేట్ మిస్ కాకుండా చూడాలని అనుకుంటున్నారు సుకుమార్.
సెకండ్ వేవ్ దెబ్బకు ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఆగిపోయాయి. కానీ సుకుమార్ మాత్రం షూటింగ్ ఆపేలా లేరు. అల్లు అర్జున్ కూడ సుకుమార్ కు పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నారు. కరోనాకు కూడ జంక కుండా షూటింగ్ జరిపిస్తున్నారు. మొత్తానికి హోల్ ఇండస్ట్రీలో ఎలాంటి భయమూ బెరుకూ లేకుండా షూటింగ్ చేస్తున్నది బన్నీ, సుకుమారే.