నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. సుమారు 600 థియేటర్లలో సినిమా విడుదలైంది. సినిమా మంచి బజ్ మీదనే విడుదలైంది. మొదటిరోజు ఆశించినంత కాకపోయినా పర్వాలేదనే ఓపెనింగ్స్ వచ్చాయి. 3.65 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా సినిమాకు పలు ఏరియాలలో హైర్స్ ఉండగా అవి మొత్తం మీద 97 లక్షల దాకా ఉండటంతో షేర్ 4.62 కోట్ల వరకు ఉంది. మంచి బడ్జెట్ పెట్టిన తెరకెక్కించిన ఈ సినిమాను సుమారు 23 కోట్లకు అమ్మారు నిర్మాతలు.
అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 24 కోట్ల వరకు ఉంటుంది. తొలిరోజు 4.62 కోట్ల షేర్ రాగా బ్రేజ్ ఈవెన్ కావాలంటే ఇంకో 19 నుండి 20 కోట్ల మధ్యలో రాబట్టాల్సి ఉంటుంది. సినిమా మీద మిక్స్డ్ టాక్ అయితే ఉంది కానీ సూపర్ హిట్ టాక్ లేదు. హిట్ టాక్ ఉండి ఉంటే ఒక వారం పది రోజుల్లో ఇంకో 20 కోట్లు వచ్చి ఉండేది. కానీ మిశ్రమ స్పందన మీద 19 కోట్లు రావడం అంటే దాదాపు కష్టమే.