నితిన్ సినిమా రెండు భాగాలు.. హిట్ కొడితే ఆంతే

Nithiin pin hopes on Power Peta

Nithiin pin hopes on Power Peta

యంగ్ హీరో నితిన్ ఈమధ్య మాస్ సినిమాలను పక్కనపెట్టి రొమాంటిక్ ఎంటెర్టైనర్లు, కాన్సెప్ట్ సినిమాలే చేస్తున్నారు. కానీ వాటిలో అరకొరగా మెప్పించిన సినిమాలే తప్ప ఎక్కడా సాలిడ్ హిట్ అనేదే లేదు. రీసెంట్ సినిమాల్లో ‘చెక్’ డిజాస్టర్ కాగా ‘రంగ్ దే’ జస్ట్ ఓకే అనిపించుకుంది. ఇక ఆయన నెక్స్ట్ సినిమా ‘అంధాధూన్’ రీమేక్. ఇందులో నితిన్ అంధుడిగా కనిపించనున్నారు. ఇది పూర్తిస్థాయి ప్రయోగాత్మక చిత్రం. దీని మీద అంచనాలు బాగానే ఉన్నాయి. కాకపోతే హిట్ కొట్టినా సాదా సీదా హిట్ అవుతుందే తప్ప బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలు తక్కువ.

కానీ నితిన్ చేస్తున్న సినిమాల్లో ‘పవర్ పేట’ అనే సినిమా ఒకటుంది. కృష్ణ చైతన్య దీని దర్శకుడు. ఇది ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా. మాస్ ఎలివేషన్స్, మంచి ఫైట్లు ఉంటాయి. పైగా ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నట్టు తెలుస్తోంది. వీటి మీదే నితిన్ ఆశలన్నీ ఉన్నాయి. బి, సి సెంటర్ ప్రేక్షకులకు సినిమా గనుక ఎక్కితే భారీ వసూళ్లు ఖాయం. ఇప్పటివరకు నితిన్ చేసిన మాస్ సినిమాల్లో సాలిడ్ హిట్ అంటే ‘దిల్’ అనే చెప్పాలి. ‘పవర్ పేట’కు ఆ స్థాయి హిట్ కొట్టగల స్టామినా అయితే ఉంది. మరి చూడాలి సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.