Home News అనుష్క "నిశ్శబ్దం" సినిమా ఓ కేబుల్ ఛానల్ లో పైరసీ ప్రసారం:రూ.1.1 కోట్లు డిమాండ్...

అనుష్క “నిశ్శబ్దం” సినిమా ఓ కేబుల్ ఛానల్ లో పైరసీ ప్రసారం:రూ.1.1 కోట్లు డిమాండ్ చేస్తున్న నిర్మాతలు

అనుష్క శెట్టి, మాధవన్, సుబ్బరాజు, షాలిని పాండే, అంజలి ప్రధాన పాత్రలగా పోషించిన మిస్టరీ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. అయితే, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. విమర్శకులైతే తక్కువ మార్కులే వేశారు. సినిమా సంగతి ఎలా ఉన్నా అనుష్క నటనను మాత్రం అంతా కొనియాడారు.

Nishabdham Makers Demands 1.1.1Cr Rs. From A Cable Channel For Damage
nishabdham makers demands 1.1.1cr rs. from a cable channel for damage

సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా చిత్ర యూనిట్ అయితే ‘నిశ్శబ్దం’ను ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉంది. సినిమాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తోన్న ఈ సమయంలో చిత్ర నిర్మాతలకు అనుకోని షాక్ తగిలిందట. ఈ సినిమా అమెజాన్ లో విడుదలైన కొన్ని గంటల్లోనే ఓ కేబుల్ ఛానల్ ప్రసారం చేసేసిందని సమాచారం. ఈ విషయం నిర్మాతల దృష్టికి వెళ్లింది. ఆ కేబుల్ ఛానల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాతలు.. వారికి లీగల్ నోటీస్ పంపినట్టు సమాచారం.

Poster From Nishabdham Movie
poster from nishabdham movie

ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ఆ కేబుల్ ఛానల్‌ను డ్యామేజ్ ఛార్జెస్ కింద నిర్మాతలు రూ.1.1 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ సైతం మరో రూ.30 లక్షలు డిమాండ్ చేస్తుందట. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించగా.. దాన్ని దర్శకుడు హేమంత్ మధుకర్ రీట్వీట్ చేశారు. అంటే, ఈ వార్తలో కచ్చితంగా నిజం ఉంది. మరి ఇంత మొత్తాన్ని ఆ కేబుల్ ఛానల్ కడుతుందో లేదంటే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు.

- Advertisement -

Related Posts

అమ్మో హనుమ విహారి మామూలోడు కాదు , బిగ్ బాస్ 4 ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టాడు.

బిగ్ బాస్ అభిజీత్ కి ఇప్పుడు ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా 2012లో విడుదలైన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో టాలీవుడ్...

రవితేజ ఫ్యాన్స్ మీసం మెలేస్తున్నారుగా ..!

రవితేజ చాలాకాలం తరువాత బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 'క్రాక్' సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన రవితేజ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. వరసగా ఫ్లాప్స్ చూసిన రవితేజ ఈ సంక్రాంతి సీజన్ లో...

సర్కారు వారి పాట ప్రొడ్యూసర్ లు మహేశ్ బాబు ఫ్యాన్స్ కి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

సర్కారి వారి పాట సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా. మహేష్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ - 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని...

కనిపించేంత సులువు కాదట.. ప్రాక్టీస్ సెషన్‌లొ ఆండ్రియా

సినిమాలోని పాత్రల కోసం కొంత మంది విపరీతంగా కష్టపడుతుంటారు. అలా పాత్రల కోసంప్రాణం పెట్టేవారికి మంచి క్యారెక్టర్స్ పడుతుంటాయి. హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైతే నటించేందుకు స్కోప్ ఉండే పాత్రలు అంతగా రావు....

Latest News