జస్ట్ మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన నిఖిల్ “కార్తికేయ 2”.!

టాలీవుడ్ లో తన సినిమాలకి అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ తనదైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. లేటెస్ట్ హీరో అడివి శేష్ కన్నా ముందు నుంచే అనేక థ్రిల్లర్ సినిమాలు చేస్తూ నిఖిల్ ఆకట్టుకుంటుండగా ఇప్పుడు తన భారీ పాన్ ఇండియా సినిమా “కార్తికేయ 2” తో సిద్ధం అవుతున్నాడు.

దర్శకుడు చందు మొండేటి తో చేసిన పార్ట్ 1 భారీ హిట్ అయ్యి మంచి వసూళ్లను సాధించింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 ని ఆల్రెడీ తెరకెక్కించి మరింత స్థాయిలో ప్లాన్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈరోజు చిత్ర యూనిట్ నిఖిల్ బర్త్ డే ట్రీట్ గా ఒక మోషన్ పోస్టర్ తో ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు.

అయితే ఈ మోషన్ పోస్టర్ సాలీడ్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఈసారి నేపథ్యం సముద్రంపై తీసుకున్నట్టు అనిపిస్తుండగా అందులో దాగి ఉన్న ఒక అంతు చిక్కని రహస్యం కోసం వెతుకుతున్నట్టుగా కనిపిస్తుంది.

ఈ వెతకడంలో నిఖిల్ తో పాటు హీరోయిన్ అనుపమ అలాగే నటుడు శ్రీనివాస రెడ్డి లు కూడా కనిపిస్తున్నారు. మొత్తానికి అయితే జస్ట్ ఈ మోషన్ పోస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో చూడాల్సిందే.

Karthikeya2 Telugu Motion Poster | Nikhil Siddharth, Anupama Parameswaran | Zee Cinemalu